బయటకు రండి ఓటు వేయండి! ఈ పేజీలో ముందస్తుగా వ్యక్తిగతంగా ఓటు వేయడం, మెయిల్ ద్వారా ఓటు వేయడం మరియు ఎన్నికల రోజున వ్యక్తిగతంగా ఓటు వేయడం గురించి సమాచారం ఉంది.

క్విక్ లింక్స్

ముఖ్యమైన తేదీలు

  • మెయిల్-ఇన్ బ్యాలెట్ రిక్వెస్ట్ చేయడానికి చివరి రోజు: గురువారం, అక్టోబర్ 24
  • ముందస్తు ఓటింగ్‌ కీ మొదటి రోజు: శనివారం, అక్టోబర్ 26
  • ముందస్తు ఓటింగ్ చివరి రోజు: శనివారం, నవంబర్ 2
  • ఎన్నికల రోజు: మంగళవారం, నవంబర్ 5

వ్యక్తిగతంగా ఓటు వేయండి

గుర్తింపు

ఓటర్లందరూ మీ ఫోటో మరియు సంతకాన్ని ఉన్న ప్రస్తుత మరియు చెల్లుబాటు అయ్యే గుర్తింపును తీసుకురావాలి. ఆక్సెప్ట్ చేయబడే గుర్తింపు రూపాలు:

  • ఫ్లోరిడా డ్రైవింగ్ లైసెన్స్
  • యునైటెడ్ స్టేట్స్ పాస్పోర్ట్
  • స్టూడెంట్ లేదా మిలటరీ గుర్తింపు

ఆమోదించబడిన గుర్తింపు యొక్క పూర్తి లిస్ట్ కోసం dos.fl.gov/elections/for-voters/voting/election-day-voting/ నీ సందర్శించండి

ముందస్తు ఓటింగ్

ముందస్తు ఓటింగ్ అక్టోబర్ 26న ప్రారంభమవుతుంది. ముందస్తు ఓటింగ్‌కు చివరి రోజు నవంబర్ 2.

ఈ పీరియడ్లో ముందస్తు ఓటింగ్ అందుబాటులో ఉన్న రోజులలో ప్రతి కౌంటీకి వారి స్వంత షెడ్యూల్ ఉంటుంది. ఈ వెబ్‌పేజీలో మీ కౌంటీ షెడ్యూల్‌ను తెలుసుకోండి: dos.fl.gov/elections/for-voters/voting/early-voting-and-secure-ballot-intake-stations/ 

ఎన్నికల రోజున

ఎన్నికల రోజు మంగళవారం, నవంబర్ 5. పోలింగ్ స్థలాలు లోకల్ టైం ప్రకారం ఉదయం 7:00 నుండి సాయంత్రం 7:00 వరకు తెరిచి ఉంటాయి. ఓటు వేయడానికి ఇదే చివరి రోజు!

మీ పోలింగ్ స్థలాన్ని dos.fl.gov/elections/for-voters/check-your-voter-status-and-polling-place/voter-precinct-lookup/ లో తెలుసుకొండి.

మెయిల్ ద్వారా ఓటు వేయండి (ఆబ్సెంటీ)

మెయిల్ ద్వారా ఓటు వేయడం అనేది ఏదైనా ఓటరు వ్యక్తిగతంగా ఓటు వేయకూడదనుకుంటే ఉపయోగించగల ఆప్షన్. మీరు మెయిల్ ద్వారా ఓటు వేయాలనుకుంటే, మీరు మీ ఎన్నికల సూపర్‌వైజర్ ఆఫీస్ నుండి తప్పనిసరిగా బ్యాలెట్‌ను రిక్వెస్ట్ చేయాలి.

యునైటెడ్ స్టేట్స్ బయట నివసిస్తున్న ఫ్లోరిడా ఓటర్లకు వేరే ప్రాసెస్  ఉంది. దయచేసి మరింత సమాచారం కోసం మిలిటరీ మరియు ఓవర్సీస్ సిటిజన్స్ ఓటింగ్ పేజీని సందర్శించండి.

బ్యాలెట్‌ను రిక్వెస్ట్ చేయండి

మెయిల్ బ్యాలెట్ ద్వారా ఓటు రిక్వెస్ట్ చేయడానికి చివరి రోజు అక్టోబర్ 24. మెయిల్ బ్యాలెట్ ద్వారా ఓటును రిక్వెస్ట్ చేయడానికి మీకు 4 ఆప్షన్లు ఉన్నాయి:

  • మెయిల్-ఇన్ బ్యాలెట్ రిక్వెస్ట్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేయండి, ఫారమ్‌ను ప్రింట్ చేయండి, ఫారమ్‌ను ఫిల్ చేయండి మరియు ఫారమ్‌ను మీ కౌంటీ ఎన్నికల సూపర్‌వైజర్‌కు మెయిల్ చేయండి.
  • ఎన్నికల సూపర్‌వైజర్ ఆఫీస్లో వ్యక్తిగతంగా ఒక ఫారమ్‌ను రిక్వెస్ట్ చేయండి.
  • ఎన్నికల కార్యాలయ సూపర్‌వైజర్‌కు ఫోన్ కాల్ చేయడం ద్వారా ఫారమ్‌ను రిక్వెస్ట్ చేయండి.
  • ఎన్నికల సూపర్‌వైజర్ వెబ్‌సైట్‌ని ఉపయోగించి ఆన్‌లైన్‌లో రిక్వెస్ట్ చేయండి.

ఫ్లోరిడా వెబ్‌సైట్‌ https://dos.fl.gov/elections/contacts/supervisor-of-elections/ లో మీ కౌంటీ ఎన్నికల సూపర్‌వైజర్‌ని తెలుసుకోండి

ఒక బ్యాలెట్‌ను తిరిగి ఇవ్వడం

మెయిల్ బ్యాలెట్‌ను తిరిగి ఇవ్వడానికి రెండు మార్గాలు ఉన్నాయి.

  • మీ పూర్తయిన బ్యాలెట్‌ని మీ కౌంటీ ఎన్నికల సూపర్‌వైజర్‌కు మెయిల్ చేయండి. పోస్ట్‌మార్క్ తేదీతో సంబంధం లేకుండా బ్యాలెట్ తప్పనిసరిగా ఎన్నికల రోజున, నవంబర్ 5న లోకల్ టైం ప్రకారం రాత్రి 7:00 గంటలలోపు ఎన్నికల సూపర్‌వైజర్ కార్యాలయానికి అందుకోవాలి.
  • ఎన్నికల రోజున లోకల్ టైం ప్రకారం రాత్రి 7:00 గంటలకు ఎన్నికల సూపర్‌వైజర్ కార్యాలయాల వద్దకు మీ పూర్తయిన బ్యాలెట్‌ను సురక్షిత డ్రాప్ బాక్స్‌కు తీసుకురండి.

ఫ్లోరిడా వెబ్‌సైట్‌ dos.fl.gov/elections/contacts/supervisor-of-elections/ లో మీ కౌంటీ ఎన్నికల సూపర్‌వైజర్‌ను తెలుసుకోండి.